వికీ మహిళా శిబిరం ప్రకటన: వికీమీడియా ఉద్యమంలో లింగ సమానత్వానికి సుగమ మార్గం

మరింత సమగ్రమైన వికీమీడియా ఉద్యమం కోసం సాధికారక  మార్పు

వికీమీడియా ఉద్యమంలో లింగ సమానత్వం వైపు జరుగుతున్న  ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని అందరికి తెలియచేయడానికి  మేము సంతోషిస్తున్నాము. వికీ మహిళా శిబిరం, వైవిధ్యం, చేరికలను ప్రోత్సహించడానికి కట్టుబడి ఉన్న సామూహిక స్వరం, ప్రపంచ వ్యాప్తంగా సమాలోచన,  సమీక్ష  కోసం ఒక సమగ్ర ప్రకటనను వెలువరిస్తున్నందుకు గర్వపడుతోంది. 

ఒక మార్గదర్శక ప్రకటన

మా ప్రకటన, వికీమీడియా ఉద్యమంలో లింగ సమానత్వాన్ని అభివృద్ధి చేయడంలో మా అచంచలమైన నిబద్ధతకు ప్రతిబింబం. సహకారం, చేరిక, సానుభూతి స్ఫూర్తితో, మేము మరింత వైవిధ్యమైన, సమానమైన సంఘాన్ని పెంపొందించే లక్ష్యంతో  కీలకమైన వరుస  సిఫార్సులను  అందిస్తున్నాము.

కీలకమైన సిఫార్సులు

1. లింగ సమానత్వానికి  ప్రాధాన్యత కోసం కార్యాచరణ సమూహము (వర్కింగ్ గ్రూప్) లేదా ప్రత్యేక దళం (టాస్క్ ఫోర్స్) ఏర్పాటు

వికీమీడియా ఉద్యమం అంతటా సమానత్వానికి  ప్రాధాన్యత, మద్దతు ఇవ్వడానికి, దానికి సంబంధించిన ప్రయత్నాలు చేయడానికి  అంకితమైన కార్యాచరణ సమూహమును ఏర్పాటు చేయాలని మేము సిఫార్సు చేస్తున్నాము. ఈ సమూహం లింగ అసమతుల్యతలను పరిష్కరించడానికి,  సమానత్వాని ప్రోత్సహించడానికి  సహకరిస్తూ అందరు భాగస్వాములతో కలిసి పని చేయాలి.

2. సమతుల్య ప్రాతినిధ్యం కోసం విధానాల అభివృద్ధి

లింగ సమతుల్యత సమర్ధించే  స్పష్టమైన, కొలవగల విధానాల సృష్టిని మేము ఆమోదించాము. ఉదాహరణకు, గుర్తింపు కోసం చాప్టర్, ప్రాతిపదికాపూర్వక (థీమాటిక్) నిర్వహణ  కోసం బోర్డులపై కనీసం 33% మహిళల ప్రాతినిధ్యా ప్రమాణాన్ని సిద్ధం చేయమని మేము సిఫార్సు చేస్తున్నాము.

3. ధన సహాయం మంజూరు అయినవారు  (గ్రాంటీ) వారి జట్లలో మహిళలను చేర్చుకోవడానికి ఆదేశం

ఇది  మా సిఫార్సు.  ధన సహాయం మంజూరు అయినవారు (గ్రాంటీ) మహిళలు+లను  వారి జట్లలో ముఖ్యమైన సభ్యులుగా ఉంచాలి.  ఈ తప్పనిసరి చేరిక విస్తృత దృక్కోణాలను నిర్ధారిస్తుంది, ప్రాజెక్ట్ ఫలితాలను మెరుగుపరుస్తుంది.

4. కంట్రిబ్యూటర్స్ కోసం మద్దతు నిర్మాణాల (సపోర్ట్ స్ట్రక్చర్స్) ఏర్పాటు

వికీ మహిళా+ ప్రాజెక్ట్‌లలో పనిచేసే వ్యక్తులను ప్రోత్సహించి, మద్దతిచ్చే వాతావరణాన్ని పెంపొందించడానికి, మేము ప్రత్యేక మద్దతు నిర్మాణాలను రూపొందించాలని ప్రతిపాదిస్తున్నాము. ఈ నిర్మాణాలు అటువంటి ఆకాంక్షలు కలిగిన వ్యక్తులకు అవసరమైన సంఘం మద్దతు, మార్గదర్శకత్వం పొందేలా చూడాలి.

5. మార్గదర్శకాల అభివృద్ధి, సుస్థిరమైన వనరులకు మద్దతు

సుస్థిరమైన వనరులతో లింగ సమానత్వ ఆరంభకాలకు,  కార్యక్రమాలకు సాధికారత కల్పించే సమగ్ర మార్గదర్శకాలు, సహాయక ఫ్రేమ్‌వర్క్‌ల రూపకల్పనను మేము సమర్థిస్తున్నాము. ఇందులో ఆర్థిక, సాంకేతిక, కమ్యూనిటీ మద్దతు ఉంటుంది.

6. ప్రపంచ సమన్వయానికి (గ్లోబల్ కోఆర్డినేషన్‌) నిబద్ధత

భాగస్వామ్య లక్ష్యం కోసం సమిష్టిగా పని చేయడానికి, సరిహద్దులు, ప్రాంతాలను దాటి ప్రపంచ సమన్వయానికి కట్టుబడి ఉండాలి. అందరికీ అందుబాటులో ఉండే వికీమీడియా ఉద్యమ లక్ష్యంతో కూడిన ప్రపంచ (గ్లోబల్) నెట్‌వర్క్‌ని సృష్టించడం మా ఉద్దేశ్యం.

భవిష్యత్తును రూపొందించడంలో మాతో చేరండి

ఈ ప్రకటన మన కమ్యూనిటీలో లింగ సమానత్వం కోసం సానుకూల మార్పును సాధికారం చేయడానికి తీసుకునే సమిష్టి నిర్ణయాన్ని సూచిస్తుంది. మా సిఫార్సుల సమీక్షలు, ప్రపంచ సమాలోచనల (గ్లోబల్ కన్సల్టేషన్) లో పాల్గొనడానికి మేము వికీమీడియా భాగస్వాములందరినీ, ఆసక్తిగలవారందరిని ఆహ్వానిస్తున్నాము.

మనం కలిసి, వికీమీడియా ఉద్యమాన్ని వైవిధ్యం, సమానత్వం, చేరికలకు దారితీసేలా చూసుకోవచ్చు. అందరికీ సమగ్రమైన, సమానమైన భవిష్యత్తును రూపొందించడానికి మేము చేయి చేయి కలిపి  చేసే ఈ పరివర్తన ప్రయాణంలో మాతో చేరండి.

తాజా విశేషాల (అప్‌డేట్‌) కొరకు,  మా సిఫార్సులపై మీ విలువైన అభిప్రాయాలు అందించే అవకాశం కోసం ఎదురు చూడండి.  మనమందరమూ  కలిసికట్టుగా ఒక మార్పు తీసుకురావచ్చు. 

(Translation of – Wiki Women Camp Declaration: Paving the Way for Gender Equity in Wikimedia Movement, posted on 14 November 2023 by WWC2023)